వినాయక నిమజ్జనాలు(Ganesh Nimajjanam) వచ్చిన ప్రతిసారి హైదరాబాద్(Hyderabad) లో హుస్సేన్ సాగర్(Hussain Sagar) వివాదం బయటకి వస్తూనే ఉంటుంది. గణేష్ నవరాత్రులు చేసిన వాళ్లంతా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామంటారు.కొంతమంది మాత్రం హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుంది అంటూ హైకోర్టుకి వెళ్తారు. గత కొన్నాళ్లుగా ఇదే జరుగుతుంది. అయినా ఏదో ఒకటి జరిగి చివరికి మళ్ళీ హుస్సేన్ సాగర్ లోనే గణేష్ నిమజ్జనం చేస్తారు.
ఈసారి కూడా ఇలాగే కొంతమంది కోర్టుకు వెళ్లగా వాళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ(Telangana) ప్రభుత్వ న్యాయవాదులు సరైన వాదనలు వినిపించకపోవడంతో హైకోర్టు హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేయకూడదని ఆర్దర్లు పాస్ చేసింది. ఎక్కడికక్కడ కృత్తిమ సరస్సులు ఏర్పాట్లు చేసి గణేష్ నిమజ్జనం చేయాలని సూచించింది కోర్టు. ఎప్పటిలాగే ఈ నిర్ణయాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, హిందూ నాయకులు, హిందువులు, పలువురు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా బీజేపీ సస్పెండ్ ఎమ్మెల్యే, గోషామహల్ రాజాసింగ్(Raja Singh) నేడు మీడియాతో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం గురించి మాట్లాడారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో యధావిధిగా చేసి తీరుతాం. పోలీసులు అడ్డుకున్నా, ఏదైనా ప్రాబ్లమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హైకోర్టులో ప్రభుత్వం తరఫున లాయర్ సరైన వాదనలు వినిపించకపోవడంతోనే కోర్టు నిమజ్జనాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్లో గత 30 ఏళ్లుగా నిమజ్జనాలు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తాం. కేవలం వినాయక నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల నుండి బస్తీల నుండి నాలాల ద్వారా కలిసిత నీరు వచ్చి హ్యూసేన్ సాగర్ కలుస్తుంది. హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లతో నింపుతానన్న కేసీఆర్ హామీ ఏమైందో చెప్పాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు.
Also Read : MMTS Special Trains : హైదరాబాద్లో నిమజ్జనం నాడు రాత్రంతా ఎంఎంటీఎస్ సర్వీస్ లు..