Raja Singh : బిజెపి అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 02:10 PM IST

నిత్యం వివాదస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే బీజేపీ గోషామహల్ నేత రాజాసింగ్..ఈసారి సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ని వ్యక్తం చేసారు. లోక్‌సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ కు , కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి. కిషన్ రెడ్డి , నిజామాబాద్ నుంచి అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, హైదరాబాద్ నుంచి మాధవిలత, చెవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి భరత్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించారు. అయితే.. ఈ లిస్టుపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు మొగోడే దొరకలేదా..? అంటూ బీజేపీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ టికెట్ మాధవీలత కు ఇవ్వడం ఫై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా అవకాశం దక్కకపోవడంతో.. ఇప్పటికే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్న క్రమంలో.. విజయ సంకల్ప యాత్రలోనూ పాల్గొనకపోవటం ఆ వార్తలకు బలం చేకూరుస్తుంది. అయితే.. విజయ సంకల్ప యాత్రలో పాల్గొనటం గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. “అంటే ఎంటీ” అని సెటైర్లు వేసినట్టు ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనప్పటికి నిత్యం పక్క పార్టీలపై విమర్శలు చేసే రాజాసింగ్..ఇప్పుడు సొంత పార్టీ పైనే కామెంట్స్ చేయడం ఆయన్ను వార్తల్లో నిలిచేలా చేస్తుంది.

Read Also : vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి