Raja Singh : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ ప్రక్రియపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గంభీర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఒకరిని నామినేట్ చేయడం సరికాదని, రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ అంతర్గత ఎన్నికల ద్వారానే ఎంపిక చేయాలంటూ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో, బూత్ స్థాయి కార్యకర్తల నుంచే మొదలుకుని ప్రముఖ నేతల వరకు అందరూ ఓటు వేయడం ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాకుండా, ఒకరిద్దరు నేతలు కూర్చొని నిర్ణయం తీసుకుంటే కార్యకర్తల భావోద్వేగాలు గాయపడతాయని హెచ్చరించారు.
పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే అంతర్గత ప్రజాస్వామ్య విధానాలు పాటించాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ తేల్చిచెప్పారు. “నావాడు-నీవాడు” అనే అభిప్రాయాలతో పదవులు పంచుకుంటే పార్టీ భవిష్యత్తు తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Kannappa : ‘కన్నప్ప’ను వెంటాడుతున్న పైరసీ భూతం.. మంచు విష్ణు ఎమోషన్ ట్వీట్