Site icon HashtagU Telugu

Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్

Raja Singh

Raja Singh

Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు. బీజేపీని వదిలి కొత్త పార్టీ ప్రారంభిస్తానన్న ప్రచారాన్ని ఖండిస్తూ, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలంగా తాను పార్టీ మారబోతున్నానన్న వార్తలు మీడియా వర్గాల్లో వస్తున్నాయని చెప్పారు. గతంలో 14 నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా బీజేపీని వీడలేదని గుర్తు చేశారు. “అప్పుడే వేరే పార్టీలోకి వెళ్లలేదు, ఇప్పుడు వెళ్లాలనే ఉద్దేశం లేదు. బీజేపీ నా చివరి పార్టీ” అంటూ ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ల నాయకత్వం వల్లే తాను బీజేపీలో కొనసాగుతున్నానని చెప్పారు. “వాళ్ల లాంటి నేతలు లేకపోతే ఎప్పుడో బీజేపీని వీడే వాడిని” అని వ్యాఖ్యానించారు.

తనకు మొదటి రాజకీయ పార్టీ టీడీపీ అయినా, చివరి పార్టీ మాత్రం బీజేపీనే అని తెలిపారు. “ఒకవేళ పార్టీని విడిచి పోవాల్సిన పరిస్థితి వస్తే, రాజకీయాల నుంచే తప్పుకుంటాను కానీ వేరే పార్టీలోకి వెళ్లను” అని తేల్చిచెప్పారు. పార్టీలో తనకు ఇబ్బందులు కలిగిస్తున్న వారికి తగిన సమయంలో సమాధానం ఇస్తానని కూడా హెచ్చరించారు.

Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!