Site icon HashtagU Telugu

Raj Pakala : పొంగులేటి చెప్పినట్లే..కేటీఆర్ బావమరిదితో స్టార్ట్ చేయబోతున్నారా…?

Ktr's Brother In Law Raj Pa

Ktr's Brother In Law Raj Pa

పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒకటో రెండో బాంబులు పేలబోతున్నాయని, తాము సియోల్‌లో ఉండగానో.. లేకపోతే హైదరాబాద్ వెళ్లిన మరుసటి రోజో పొలిటికల్ బాంబులు పేలే అవకాశముందని ఉందని , ధరణి, కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇలా పలు వాటిని పరిగణలోకి తీసుకొని , పక్క ఆధారాలతో అరెస్ట్ లు చేయబోతున్నామని హెచ్చరించారు.

ఆలా హెచ్చరించారో లేదో తాజాగా కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల (KTR’s brother-in-law Raj Pakala) ఫామ్ హౌస్ (Janwada Farm House) లో సైబరాబాద్ ఎస్వోటీ మరియు నార్సింగి పోలీసులు డ్రగ్స్ పార్టీ జరుగుతున్నదన్న సమాచారం ఆధారంగా ఆకస్మిక దాడి చేశారు. దాడిలో భాగంగా, ఫాం హౌస్‌లో ఉన్న వారిని డ్రగ్స్ టెస్టు చేయగా, కొందరికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలడంతో విషయమంతా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు NDPS (Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో విదేశీ మద్యం కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు, దీని కారణంగా ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కూడా మరో కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్త విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడి నేపథ్యంలో భాగస్వామ్యుల వివరాలు, వారి సంబంధాలు, డ్రగ్ సరఫరా ఎక్కడి నుండి జరిగిందన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై కాంగ్రెస్ (Congress) ట్వీట్ చేసింది.

పార్టీలో పాల్గొన్న వారు: 35 మంది, అందులో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు.
మద్యం & అనుమతులు: పార్టీకి అనధికారికంగా 10.5 లీటర్లు ఉన్న ఏడు విదేశీ మద్యం బాటిళ్లు మరియు 10 ఇండియన్ మద్యం బాటిళ్లు ఉపయోగించినట్లు గుర్తించారు. ఎక్సైజ్ శాఖ నుండి అనుమతి తీసుకోలేదు.
డ్రగ్ టెస్టులు: అనుమానంతో అక్కడి పురుషులకు డ్రగ్ కిట్స్‌తో టెస్టులు చేశారు. అందులో విజయ్ మద్దురి అనే వ్యక్తి కొకైన్ పాజిటివ్‌గా తేలడంతో అతనిని రక్త పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతనిపై NDPS యాక్ట్ సెక్షన్ 27 కింద మోకిలా పీఎస్ లో కేసు నమోదు చేశారు.
స్నిఫర్ డాగ్ తో పరిశీలన: ప్రాంగణాన్ని స్నిఫర్ డాగ్ సహాయంతో తనిఖీ చేసి మాదకద్రవ్యాల కోసం వెతికారు.
పార్టీ నిర్వాహకుడు: ఫాం హౌస్ యజమాని రాజ్ పాకాల (కేటీఆర్ సోదరికి చెందిన వ్యక్తి) ఈ పార్టీని నిర్వహించినట్లు తేలింది. మద్యం అందించేందుకు ఎక్సైజ్ లైసెన్స్ తీసుకోకపోవడంతో, ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 A, 34 (1) r/w 9 కింద అతనిపై కేసు నమోదైంది. అని తెలిపింది.

Read Also : Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..