Telangana BJP: తెలంగాణ బీజేపీలో అనుకోని మార్పు చోటుచేసుకుంది. బీజేపీ చీఫ్ లో ఎటువంటు మార్పు లేదంటూనే నిన్న మంగళవారం అధ్యక్షుడిని మార్చుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళుతుందని తెలంగాణ ఇన్‌చార్జ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పలుమార్లు చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు. అయితే తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా జి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్‌గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్ర బిజెపి మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్‌పై పార్టీలో అసమ్మతి నేతల్లో రాజ్ గోపాల్ రెడ్డి ఒకరు.
Read More: Pawan Kalyan – Anna Lezhneva : బయటకు వచ్చిన పవన్ భార్య.. రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారుగా..