Raising GST: చేనేత జీఎస్టీపై పొలిటిక‌ల్ గేమ్‌!

చేనేత వ‌స్త్రాల‌పై జీఎస్టీ పెంపు వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి మ‌ధ్య వివాదానికి దారితీయ‌నుంది. జీఎస్టీ పెంపుపై తెలంగాణ‌తో స‌హా రాష్ట్రాల‌న్ని ఒత్తిడి తెచ్చాయ‌ని కేంద్రం చెబుతోంది.

  • Written By:
  • Updated On - January 1, 2022 / 04:21 PM IST

చేనేత వ‌స్త్రాల‌పై జీఎస్టీ పెంపు వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్రానికి, కేంద్రానికి మ‌ధ్య వివాదానికి దారితీయ‌నుంది. జీఎస్టీ పెంపుపై తెలంగాణ‌తో స‌హా రాష్ట్రాల‌న్ని ఒత్తిడి తెచ్చాయ‌ని కేంద్రం చెబుతోంది. ఒక వేళ జీఎస్టీ పెంపును వ్య‌తిరేకిస్తే ఆ మేర‌కు రాష్ట్ర వాటా వ‌ద్ద‌ని కేంద్రానికి లేఖ రాయాల‌ని జాతీయ వీవర్స్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ దాసు సురేష్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, చేనేత‌పై జీఎస్టీని ర‌ద్దు చేసేలా రాష్ట్రాలు డిమాండ్ చేయాల‌ని కోరుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కెటి రామారావు అలియాస్ కేటీఆర్ జీఎస్టీ పెంపు ఆలోచ‌న విర‌మించుకోవాల‌నికేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశాడు. ఇంకో వైపు కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్రం ఒత్తిడి మేర‌కు జీఎస్టీని పెంచుతున్నామ‌ని చెబుతోంది. ఆ క్ర‌మంలో వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో రాష్ట్రం, కేంద్రం మ‌ధ్య జ‌రిగిన పొలిటిక‌ల్ గేమ్ ను మ‌ళ్లీ చేనేత‌పై జీఎస్టీ పెంపు అంశంపై చూడ‌బోతున్నాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్ర‌భుత్వం జీఎస్టీ రాబ‌డి కోసం ప‌లు ప్ర‌యత్నాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత‌లు 40వేలపై ఉంటారు. ప్ర‌పంచ స్థాయి ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తుంటారు. ఇక్క‌డి పోచంప‌ల్లి, గ‌ద్వాల్ నేత చీర‌లకు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి. జీఎస్టీ కార‌ణంగా రంగులు, పట్టు, పత్తి దారాలతో పాటు ఇతర వస్తువుల ధరలు ప‌రిగే అవ‌కాశం ఉంది. చీర‌ల ధ‌ర‌లు పెరిగే మార్కెట్ ప‌డిపోతోంది. ఫ‌లితంగా వేలాది మంది కార్మికులు ఉపాథి కోల్పోయే ప్ర‌మాదం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పోచంపల్లి చేనేత రంగంలో రంగారెడ్డి, నల్గొండ , వరంగల్ జిల్లాలకు చెందిన వేలాది కుటుంబాల‌కు చెందిన వాళ్లు నేత కార్మికులుగా ఉన్నారు. కోవిడ్-19 కారణంగా చాలా ఆర్డర్‌లు ఇవ్వడం లేదు. చెల్లింపులలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో GSTని 12%కి పెంచితే, అమ్మకాలు పడిపోతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే కోవిడ్ కార‌ణంగా నేత కార్మికులు 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మేర‌కు జాతీయ వీవర్స్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ దాసు సురేష్ వెల్ల‌డించాడు. కోవిడ్ కు ముందు రూ.1,000-1,200 కోట్ల చేనేత వ్యాపారం జరిగేది. కనీసం రూ. 1,500 కోట్ల నష్టాన్ని కోవిడ్ కార‌ణంగా చేనేత రంగం చ‌విచూసింది.

రాష్ట్రంలో గుర్తింపు పొందిన మగ్గాలు 18వేలు, గుర్తింపు లేని మగ్గాలు 5వేలు ఉన్నాయని అంచ‌నా. ఒక్కో మగ్గం వద్ద కనీసం ఇద్దరు ముగ్గురు నేత కార్మికులు పని చేస్తారు. సిరిసిల్ల-కరీంనగర్, జోగుళాంబ గద్వాల్, పోచంపల్లికి చెందిన తెలంగాణ చేనేత వస్త్రాలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు అత్యుత్తమ నాణ్యత గల మెటీరియల్‌ను అందించడంలో ప్రసిద్ధి చెందాయి. ఈ పరిశ్రమపై అదనపు భారం ఆయా ప్రాంతాల్లోని కార్మికులు వృత్తిని వదిలివేయవలసి వస్తుందని ఆందోళ‌న చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి..ప్ర‌త్యేకించి కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం చేనేత‌ల‌తో నిండి ఉంది. అందుకే, కేటీఆర్ వెంట‌నే జీఎస్టీ పెంపుపై స్పందించిన‌ప్ప‌టికీ రాజ‌కీయాన్ని సంత‌రించుకుంటోంది. కేసీఆర్ స‌ర్కార్ ఒత్తిడి మేర‌కు జీఎస్టీని పెంచామ‌ని కేంద్రం చెబుతోంది. సో..మ‌ళ్లీ కేంద్రం, రాష్ట్రం చేనేత‌ల కోసం మైండ్ గేమ్ పాటిటిక్స్ ఆడ‌బోతున్నాయ‌న్న‌మాట‌.