Site icon HashtagU Telugu

Weather Warning: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని  వాతావరణ హెచ్చరికలు  (weather warnings) జారీ చేసింది. ఈ రోజు భారీ నుండి అతిభారీ వర్షములు తెలంగాణలో కొన్ని జిల్లాలలో (ఆరంజ్ అలెర్ట్ ) అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 25,26,27 తేదీలలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు పడే అవకాశ ఉంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50కిమీ వేగంతో వీచే ప్రమాదం కూడా ఉంది.

భారీ వర్షాల రాకతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్, కడెం ప్రాజెక్టుతో పాటు, నిజాంసాగర్‌, పోచారం, కౌలాస్‌నాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి 38వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నీటి మట్టం 10 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. పోచారం ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండుకుని అలుగు దూకుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌ సైతం 1 టీఎంసీకి చేరింది.

అయితే రాగల మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణ చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రధాన రహదారులు జలమయవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేస్తూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేస్తున్నారు.

Also Read: Manipur Incident: మణిపూర్ ఘటనపై దద్దరిల్లిన రాజ్య సభ