Rains From August 20 : తెలంగాణలో వానలు.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే ?

Rains From August 20 : తెలంగాణలో ఇప్పుడున్న వాతావరణం ఎండకాలాన్ని తలపిస్తోంది.. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 10:10 AM IST

Rains From August 20 : తెలంగాణలో ఇప్పుడున్న వాతావరణం ఎండకాలాన్ని తలపిస్తోంది..

రాష్ట్రంలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

దీంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు.. 

వాతావరణం ఇలా మారిపోయిందేంటి అని చర్చించుకుంటున్నారు.. 

ఈనేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఒక తీపి కబురు వినిపించింది.. 

ఆగస్టు 20 నుంచి తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని  IMD తెలిపింది.

బంగాళాఖాతంలో వాయుగుండం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. 

Also read : Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు

సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో వానలు పడతాయి.. ఎండలు తక్కువగా నమోదవుతాయి. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. గత నెల (జులై)లో రాష్ట్రంలో సగటు వర్షపాతం కంటే 114 శాతం ఎక్కువగా వానలు పడ్డాయి. ఆగస్టు నెలకు వచ్చే సరికి సగటు వర్షపాతంలో 81 శాతం లోటు ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉండటం వల్ల,  ఎల్‌నినో ప్రభావం వల్ల ఇలా జరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో వారం రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయని, ఉక్కపోత తప్పదని (Rains From August 20)  చెబుతోంది. ఆగస్టు 20 వరకు వర్షాలు పడే అవకాశం లేదని అంటోంది.

Also read : Three Foreign Women : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు.. ఎవరు ?