Weather : ఒక్కసారిగా చల్లబడ్డ తెలంగాణ..హమ్మయ్య అంటున్న ప్రజలు

తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 06:08 PM IST

నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. రోహిణి కార్తెకు ముందే రోళ్లు పగిలేలా ఉష్ణోగ్రతలు బెంబేలెత్తించాయియి. ఉదయం 07 గంటలకు భానుడి ఉగ్రరూపం దాలుస్తు భగభగమనడం మొదలుపెడుతూ వచ్చాడు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు పెరగడంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ వచ్చారు. ఉదయం 9 దాటితేనే ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. రెండు రోజులుగా 48 , 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ ఎండలు కాస్త తగ్గితే బాగుండని అంత అనుకున్నారు. ఈ ఎండలకు దాదాపు 50 మంది వరకు మరణించారు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం చల్లబడింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది. కొన్నిరోజులుగా ఎండవేడితో తాళలేకపోతున్న ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ, ఖమ్మం, వరంగల్ , హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్ లో కురిసిన భారీ వర్షానికి రేవంత్ సభకు అంతరాయం ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న తరుణంలో అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భారీ ఈదురు గాలులు వీచి టెంట్లు నేలవాలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి మంథనిలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ హాజరవుతుండగా, అన్ని ఏర్పాట్లు చేశారు. కొద్ది సేపట్లో ఆయన ప్రసంగిస్తారని భావిస్తున్న తరుణంలో భారీ ఈదురుగాలులతో టెంట్లు మొత్తం కూలిపోయాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల రెండు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్ లోని కొంపల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్ ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతోంది. మియాపూర్ లో వడగండ్ల వాన కురిసింది. మరో 3 గంటలు పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఓవరాల్ గా నిన్నటి వరకు తీవ్ర ఎండ , ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షం కాస్త ఊరటనిస్తుంది.

Read Also : Apps Alert : దడ పుట్టిస్తున్న ‘డర్టీ స్ట్రీమ్’.. ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు అలర్ట్