Site icon HashtagU Telugu

Hyderabad : ఒక్కసారిగా హైదరాబాద్లో మారిన వాతావరణం

Hyd Rain

Hyd Rain

హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ దంచికొట్టగా..సాయంత్రం 4 గంటలు కాగానే ఒక్కసారిగా వాతావరణం మారింది. దట్టమైన మబ్బులతో ఆకాశం మేఘావృతమై.. జోరు వాన అందుకుంది. హయత్‌నగర్‌, పెద్ద అంబర్ పేట్‌, మల్కాజిగిరి, ఉప్పల్, కుషాయిగూడ, మేడ్చల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. వాన కారణంగా చాలా చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. హయత్‌నగర్‌ ప్రాంతంలో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

అటు తెలంగాణ లోని మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Read Also : NATO Dating : నాటో డేటింగ్ అంటే ఏమిటి..? ఈ వైరల్ డేటింగ్ పద్ధతి ఎందుకు మంచిదో తెలుసా.?