Site icon HashtagU Telugu

Hyderabad Rain : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తగా వర్షాలే

IMD Weather Forecast

IMD Weather Forecast

హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో మరోసారి వర్షం (Rain ) దంచికొట్టింది. సరిగ్గా ఆఫీసులు , స్కూల్స్ ముగిసే సమయంలో వర్షం పడడం తో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్ పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, తిరుమలగిరి, అల్వాల్, కవాడిగూడ, దోమలగూడ, విద్యానగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, అడిక్‌మెట్, బేగంపేట్, బంజారాహిల్స్, కీసర, చర్లపల్లి, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచింది. మరోవైపు మరో ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఉత్తర తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

Read Also : Rolls-Royce Spectre : చరణ్ గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారు