Site icon HashtagU Telugu

Rain Forecast : నేడు, రేపు ఈ జిల్లాలకు వర్ష సూచన

Rain Forecast : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక రేపు(సోమవారం) కూడా పలుచోట్ల వానలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ, రేపు  వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణ పేట జిల్లాలకు వర్ష సూచన ఉంది. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి ఇవాళ తెలంగాణ రాష్టంలోని నిజామాబాద్, మహారాష్ట్రలోని బారామతి మీదుగా వెళ్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాబోయే 2 నుంచి  3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని అధికారులు చెప్పారు. శనివారం రోజు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందన్నారు. ఈ ప్రభావంతోనే ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన(Rain Forecast) ఉందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. రాయలసీమలోనూ ఒకటి లేదా రెండు చోట్ల వానలు పడే సూచనలు ఉన్నాయి.

Also Read : Ramoji Smruti Vanam : స్మారక కట్టడాన్ని ముందే రెడీ చేసుకున్న రామోజీ

కోస్తా ఆంధ్ర ప్రాంతం పక్కనున్న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, దాని నుంచి వస్తున్న మేఘాలు కోస్తాంధ్ర, రాయలసీమపై విస్తరిస్తున్నాయని శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలను బట్టి తెలుస్తోంది.  ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత  విశాఖపట్నంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ తెలంగాణలోని పలు జిల్లాలకు రాత్రి 11 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్‌ నగరానికి వర్ష సూచన ఉంది.

Also Read : T20 World Cup: నేడు భార‌త్‌- పాకిస్థాన్ మ్యాచ్‌.. పాక్ జ‌ట్టులోకి కీలక ఆట‌గాడు, గెలుపెవ‌రిదో..?