తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం (Rain) కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాల్గు రోజుల పాటు ఇలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో విద్యాసంస్థలకు ఈరోజు, రేపు సెలవు ప్రకటించింది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి. ఈ ప్రకటన ఫై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించే సెలవు ఇదో నిన్న సాయంత్రం కానీ , ఈరోజు ఉదయాన్నే కానీ ప్రకటిస్తే తమ పిల్లలను వర్షంలో స్కూల్స్ కు పంపించే వాళ్లం కాదుకదా అని వారంతా వాపోతున్నారు.
స్కూల్ ఏడు గంటలకి ప్రారంభమైతే 9 గంటలకు సెలవు ప్రకటించడం ఏంటని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ మంత్రి సబితకి ట్వీట్లు చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు వర్షంలో తడుస్తూ స్కూల్ కి వెళ్లారని, తీరిగ్గా 9 గంటలకు మంత్రి సబితా ట్వీట్ చేయడం ఏంటి అని వారు ప్రశ్నింస్తున్నారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఈ సెలవు ప్రకటన ఫై మంత్రి సబితా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పిల్లలు స్కూల్ వెళ్లిన తర్వాత నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యా శాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను (Rain) చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుండి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ సీఎం కేసీఆర్ పై కూడా కౌంటర్ వేశారు.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను చూస్తూ ఉదయం 9 గంటలకు స్పందించి సెలవులు ప్రకటించాలని ఈరోజు ఫాంహౌజ్ నుండి ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు https://t.co/7NpPcD5KjV
— Raghunandan Rao Madhavaneni (@RaghunandanraoM) July 20, 2023