Railway Track : ఇంకా పూర్తికాని మహబూబాబాద్ రైల్వే ట్రాక్..నేడు మరో 20 రైళ్లు రద్దు

తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకుపోవడం తో మూడు రోజులుగా రైళ్లు బంద్ అయ్యాయి

Published By: HashtagU Telugu Desk
Railway Track Restoration W

Railway Track Restoration W

మహబూబాబాద్ (mahabubabad) జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జిల్లా అతలాకుతలమైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం, ఖమ్మం , సూర్యాపేట , తోరూరు వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. ఇటు కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ (Kesamudram-Intakanne) కింద కంకర కొట్టుకుపోవడం తో మూడు రోజులుగా రైళ్లు బంద్ అయ్యాయి. నిన్నటి తో ట్రాక్ పనులు పూర్తి అవుతాయని..ఈరోజు రైళ్లు నడుస్తాయని భావించిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది.

We’re now on WhatsApp. Click to Join.

ధ్వంసమైన ట్రాక్ ను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన దక్షిణ మధ్య రైల్వే పనులు చేపట్టింది. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సుమారు పదివేల మంది ఉద్యోగులు ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. శనివారం అర్థరాత్రి ట్రాక్ వరద తాకిడికి కొట్టుకుపోగా.. ఇప్పటికీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీంతో మూడోరోజు కూడా విజయవాడ – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి వరకూ 496 రైళ్లు రద్దవ్వగా.. 152 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తికాకపోవడంతో నేడు మరో 20 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. వాటిలో హౌరా-బెంగళూరు, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్‌- త్రివేండ్రం, హాతియా-బెంగళూరు, ఎర్నాకులం-హాతియా, జైపూర్‌-కోయంబత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్‌బాద్‌-కోయంబత్తూరు రైళ్లను రద్దుచేశారు.

రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సెప్టెంబర్ 3న రద్దయిన రైళ్లు

12709 – గూడూరు – సికింద్రాబాద్
12710 – సికింద్రాబాద్ – గూడూరు
12727 – విశాఖపట్నం – హైదరాబాద్
12739 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20810 – నాందేడ్ – సంబల్ పూర్
12745 – సికింద్రాబాద్ – మణుగూరు
17659 – సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్
17250 – కాకినాడ పోర్ట్ – తిరుపతి
17233 – సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్
12775 – కాకినాడ పోర్ట్ – లింగంపల్లి
12615 – ఎంజీఆర్ చెన్నై – న్యూ ఢిల్లీ
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్
12749 – మచిలీపట్నం – బీదర్
12750 – బీదర్ – మచిలీపట్నం
17208 – మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ

సెప్టెంబర్ 4న రద్దయిన రైళ్లు

12746 – మణుగూరు – సికింద్రాబాద్
17660 – భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్
11019 – సీఎస్ఎంటి ముంబై – భువనేశ్వర్
20707 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
20708 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20833 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20834 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
12706 – సికింద్రాబాద్ – గుంటూరు
12705 – గుంటూరు – సికింద్రాబాద్
17206 – కాకినాడ పోర్ట్ – సాయినగర్ షిర్డీ
17234 – సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్
12713 – విజయవాడ – సికింద్రాబాద్
12714 – సికింద్రాబాద్ – విజయవాడ
12776 – లింగంపల్లి – కాకినాడ పోర్ట్

సెప్టెంబర్ 5న రద్దయిన రైళ్లు

03260 – ఎస్ఎంవీటీ బెంగళూరు – దానాపూర్
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్

Read Also : CM Revanth Reddy : నేను ఫామ్ హౌస్‌లో పడుకునే టైపు కాదు – సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 03 Sep 2024, 01:37 PM IST