Railway Track Destroyed: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు గత మూడు రోజులుగా దంచికొడుతున్నాయి. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. భారీ వర్షాల కారణంగా బయట కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో వర్షం ధాటికి పలు రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోగా (Railway Track Destroyed).. ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి.
భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కట్టపై వరద నీటిలో RTC బస్సు నిలిచిపోయింది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు.
TG: భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కట్టపై వరద నీటిలో RTC బస్సు నిలిచిపోయింది. రాత్రి నుంచి ఇక్కడే… pic.twitter.com/oQn7peypgf
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
ఈ విషయం తెలుసుకున్న అధికారులు బస్సులోని (TS24Z 0018) ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ధైర్యం చెబుతున్నారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఆహరం, మంచినీళ్ళను అధికారులు అందించారు. అయితే ఈ ఘటనపై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ స్పందించారు. వాగులో చిక్కుకున్న ప్రయాణికుల విషయం సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సులోని ప్రయాణీకులను వెంటనే కాపాడాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీచేశారు.
Also Read: Group 3 Edit Option: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 6 వరకు ఛాన్స్..!
వరద ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
మహబూబాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.
మహబూబాబాద్ లో నిలిచిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, పలు రైళ్ల నిలిపివేత pic.twitter.com/mQwLRNYoiH
— Sarita Avula (@SaritaAvula) September 1, 2024