తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సొంత నియోజకవర్గమైన కొడంగల్ (Kodangal ) మీదుగా రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన తుది సర్వే పూర్తయింది. నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్ నుంచి వికారాబాద్ (Vikarabad) వరకు సాగనున్న ఈ కొత్త మార్గానికి సంబంధించి అధికారుల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) రూపకల్పన జరుగుతోంది. జూలై నెలాఖరులోగా ఈ డీపీఆర్ రైల్వే బోర్డుకు చేరనుందని సమాచారం. కొత్త మార్గంతో తెలంగాణ రైల్వే నెట్‌వర్క్ మరింత విస్తరించనుంది.
ఈ రైల్వే ప్రాజెక్ట్ దూరం సుమారు 122 కిలోమీటర్లు కాగా, నిర్మాణానికి రూ.2,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఈ మార్గంలో కృష్ణా, మక్తల్, నారాయణపేట, దామరగిద్ద, బాలంపేట, దౌల్తాబాద్, కొడంగల్, పరిగి, వికారాబాద్ స్టేషన్లు ఏర్పాటుకాబోతున్నాయి. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్ట్‌కు నిధులు మొత్తం వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో రైల్వే కనెక్టివిటీ లేక అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలు ఈ మార్గంతో ప్రగతిపథంలోకి రానున్నాయి.
Minister Komatireddy : దసరా నాటికి ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
ఏదైనా రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే ROR (రేట్ ఆఫ్ రిటర్న్) కనీసం 10% ఉండాలి. కానీ ఈ మార్గంలో అటవీ భూములు, సాంకేతిక పరిమితుల కారణంగా ROR కేవలం 5% వరకే ఉండబోతోందని అధికారులు అంచనా వేశారు. అయినా సీఎం రేవంత్ సొంత నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉండేలా మార్గాన్ని స్వల్పంగా మార్చినట్లు సమాచారం. ఈ మార్పులు ప్రజలకు ప్రయోజనం కలిగించడంతో పాటు, కేంద్రం నుంచి ఆమోదం వచ్చే అవకాశాలను కూడా పెంచనున్నాయి.
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు!
ఈ కొత్త రైల్వే మార్గం పూర్తి అయితే, కర్ణాటకలోని హుబ్లీ మరియు గోవాలోని మడ్‌గావ్‌కు దూరం సుమారు 35–40 కిలోమీటర్లు తగ్గనుంది. ప్రస్తుతం గుంతకల్ మార్గం మీదుగా రైళ్లు వెళుతుండగా, రద్దీ తగ్గి ప్రయాణ సమయం తక్కువవుతుంది. సిమెంట్ సరఫరా, వాణిజ్య రవాణా సైతం సులభతరమవుతుంది. ముఖ్యంగా హుబ్లీ, తాండూరు ప్రాంతాల నుంచి రవాణా సులభంగా జరగనుండటంతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఇది బలాన్నిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ రవాణా రంగంలో ఒక కీలక ముందడుగుగా నిలవనుంది.