Rail Restaurant: హైదరాబాద్ లో రైలు రెస్టారెంట్, వెరైటీ వంటకాలతో వెల్ కం!

ఆహార ప్రియుల ఆలోచనలకు అనుగుణంగా వివిధ రకాల థీమ్స్ ను ప్రవేశపెడుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.

Published By: HashtagU Telugu Desk
Rail Restuarant

Rail Restuarant

ఆహార ప్రియుల ఆలోచనలకు అనుగుణంగా వివిధ రకాల థీమ్స్ ను ప్రవేశపెడుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఇప్పటికే రోబో రెస్టారెంట్ లాంటివి అందుబాటులో ఉండగా, తాజాగా మరో కొత్త థీమ్ వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’లో రైలు ప్రియులు, ఆహార ప్రియులు ఇప్పుడు ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తోంది. ఇక్కడ స్టేషన్‌లోని మొట్టమొదటి కోచ్ రెస్టారెంట్ సందర్శకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. స్టేషన్‌లో రోజూ వచ్చే సందర్శకులకు ఆకట్టుకునేందుకు నిర్వాహకులు రెస్టారెంట్ ఆన్ వీల్స్ పేరుతో నోరూరించే వంటకాలను అందిస్తున్నారు.

అంతేకాదు.. అందమైన ఇంటీరియర్స్‌తో రెండు హెరిటేజ్ రైలు కోచ్ ల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేయబడింది. సాంప్రదాయ దక్షిణ భారత రుచుల మొదలుకొని ఉత్తర, మొఘలాయి మరియు చైనీస్ వరకు బహుళ-వంటకాల మెనూను అందిస్తోంది.  ఈ రెస్టారెంట్ ఇతర వాటికి వినూత్నంగా ఉండటంతో ప్రయాణికులతో పాటు విజిటర్స్ క్యూ కడుతున్నారు. రెస్టారెంట్ స్టేషన్‌కు ప్రధాన ద్వారం వద్ద సర్క్యులేషన్ ప్రాంతానికి సమీపంలో ఉంది.

ఈ రెస్టారెంట్ రైలు ప్రయాణీకులకు సేవలను అందించడానికి 24 గంటలూ పనిచేస్తుందని, పరిశుభ్రమైన మరియు నాణ్యమైన ఆహారం, పానీయాల అందజేస్తుందని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ “హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు  జంట నగరాల ప్రాంతంలో మరో విలక్షణమైన ఫుడ్ సర్వీస్ ఎంపికను పొందుతారు.” అని చెప్పారు.

Also Read: BRS Politics: కోమటిరెడ్డికి బిగ్ షాక్.. కారెక్కిన యాదాద్రి ముఖ్యనేత

  Last Updated: 25 Jul 2023, 12:13 PM IST