Site icon HashtagU Telugu

Tonique Liquor : ‘టానిక్ లిక్కర్’‌పై రైడ్స్.. అందులో పార్ట్‌నర్స్ ఎవరో తెలుసా ?

Tonique Liquor

Tonique Liquor

Tonique Liquor : టానిక్ లిక్కర్ గ్రూప్స్‌.. తెలంగాణలోనే వెరీవెరీ స్పెషల్!!  గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల కోసం దానికి ప్రత్యేక అనుమతులు  ఇచ్చారు. ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎలైట్ అనుమతులు కేవలం టానిక్‌కు మాత్రమే దక్కాయి.ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో టానిక్‌కు 11 ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ‘క్యూ బై టానిక్’ పేరుతో టానిక్ లిక్కర్ గ్రూప్స్‌ మద్యం విక్రయాలను నిర్వహిస్తోంది. ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా టానిక్ లిక్కర్ గ్రూప్స్‌కు గత ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్ పాలసీలో ఎక్కడా ప్రత్యేక అనుమతుల గురించి ప్రస్తావన లేదనే వాదన వినిపిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

తాజాగా టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై(Tonique Liquor)  కమర్షియల్ టాక్స్ అధికారులు రైడ్స్ చేశారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు జరిగాయి.ఏ మద్యం షాపునకు లేని ప్రత్యేక అనుమతులు టానిక్‌కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయని సమాచారం. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ బ్రాంచీలు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం.మాజీ సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు, అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంకా రెడ్డిలకు టానిక్‌ లిక్కర్ గ్రూప్స్‌ బ్రాంచీలలో పార్ట్‌నర్‌షిప్ ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.

Also Read :Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్‌’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?

17చోట్ల ఎన్ఐఏ  తనిఖీలు

బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది.  మంగళవారం ఉదయం ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలలో 17చోట్ల ఎన్ఐఏ  బృందాలు తనిఖీలు చేపట్టాయి. 2023లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి తీవ్రవాదులు పరారయ్యారు. ఈ గతేడాది అనుమాతుల ఇళ్లల్లో సోదాలు చేయగా.. భారీగా ఆయుధాలు NIA అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీటు దాఖలు చేసిన NIA … నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. ఇటీవల రామేశ్వరం కేఫ్‌‌లో జరిగిన పేలుళ్లపై కూడా ఎన్‌ఐఏ అధికారులు విచారణ వేగవంతం చేశారు. పేలుడుతో ఉగ్రవాదులకు సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.