Rahul Telangana Tour : మూడు రోజుల పాటు తెలంగాణ లో రాహుల్ పర్యటన

మరోసారి రాహుల్ మూడు రోజుల పాటు తెలంగాణ లో పర్యటించబోతున్నారు. ఈనెల రెండో వారంలో రాహుల్ తెలంగాణలో అడుగుపెట్టనున్నారు

Published By: HashtagU Telugu Desk
Rahul Ts

Rahul Ts

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అగ్ర నేతలు వరుస పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ (PM Modi) రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు తెలంగాణ లో పర్యటించగా..ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ (Rahul) సైతం రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్‌ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. తుక్కుగూడలో టీ కాంగ్రెస్ నిర్వహించిన విజయగర్జన భారీ బహిరంగ సభలో సోనియాగాంధీ (Sonia)తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో రాహుల్ తన ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. అలాగే తెలంగాణ ప్రజలఫై వరాల జల్లు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

6 గ్యారెంటీ హామీ పధకాలు ప్రకటించి ప్రజల్లో ఆసక్తి పెంచారు. ఈ ఆరు గ్యారెంటీ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి రాహుల్ మూడు రోజుల పాటు తెలంగాణ లో పర్యటించబోతున్నారు. ఈనెల రెండో వారంలో రాహుల్ తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. రాహుల్‌ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్‌ నేతలు సర్వం సిద్దం చేస్తున్నారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని కాం‍గ్రెస్‌ ప్రయత్నిస్తోంది. మరి ఈ మూడు రోజులు రాహుల్ ఏంచేయబోతున్నారు..ఎవరితో సమావేశాలు జరపనున్నారు..అనేవి తెలియాల్సి ఉంది.

Read Also : Leukemia Symptoms: లుకేమియా లక్షణాలు

  Last Updated: 05 Oct 2023, 06:33 PM IST