Tukkuguda Congress Meeting : దేశంలో జనగణన చేపడతాం – రాహుల్‌ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే సభ వేదికపై గ్యారంటీ కార్డు విడుదల చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 08:08 PM IST

కాంగ్రెస్ తలపెట్టిన ‘జనజాతర’ (Congress Jana Jathara) సభ పేరుకే కాదు సభకూడా జనంతో జాతరను తలపించింది. రాష్ట్ర నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు తండోపతండాలుగా హాజరై సభను సక్సెస్ చేసారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ (Tukkuguda Congress Meeting) నుండే శంఖారావం మోగించి అఖండ విజయం సాధించిన కాంగ్రెస్..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తుక్కుగూడ నుండే ఎన్నికల మేనిఫెస్టో ను రిలీజ్ చేసి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక జనజాతర సభ వేదికగా రాహుల్‌ గాంధీ న్యాయ పత్రం పేరిట కాంగ్రెస్‌ జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ ..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే సభ వేదికపై గ్యారంటీ కార్డు విడుదల చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను. అమలు చేయదగిన గ్యారంటీలనే మీకు అందజేశాం. రూ.500 సిలిండర్‌, గృహజ్యోతి గ్యారంటీ, మహిళలకు ఉచిత బస్సు, గృహలక్ష్మి గ్యారంటీలు ప్రకటించాం..వాటిని అమలు చేస్తున్నాం. అలాగే 25 వేలమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందజేశాం. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం.

ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం అని , జాతీయ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు ఉన్నాయని పేర్కొన్నారు. మన్రేగాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించినట్లుగానే ..నిరుద్యోగ యువతకు కూడా ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కలిపి ఏడాది పాటు శిక్షణతో కూడిన లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం కల్పిస్తామని రాహుల్ తెలిపారు.

రెండవది దేశంలోని నారీ న్యాయ్ పేరుతో ఏడాదికి మహిళలకు లక్ష రూపాయలు అందజేయబోతున్నట్లుగా ప్రకటించారు. నిరుపేద కుటుంబాలకు ఏడాదికి లక్ష రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని మాటిచ్చారు. మూడో హామీ రైతులకు న్యాయం. మన దేశంలో రోజూ రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం 11లక్షల కోట్ల రూపాయల బడా వ్యాపారవేత్తల రుణాలు మాఫీ చేసింది. రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చారు.

దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతాం. జనగణనతో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతాం. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుంది అని రాహుల్ తెలిపారు.

Read Also : MI vs DC: రేపు వాంఖడేలో మిస్టర్ 360 ఎంట్రీ?

Click Here Live