Site icon HashtagU Telugu

KTR Vs Revanth Reddy: కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్..!

KTR Spot

Ktr Revanth Reddy

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అమేథీలో తన సొంత పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోలేకపోయారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. కెసిఆర్ జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ.. BRSపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. ‘BRSపై రాహుల్‌ స్పందించిన తీరు హాస్యాస్పదం. అంతర్జాతీయ నేత రాహుల్‌ తన సొంత నియోజకవర్గం అమేథీలోనే గెలవలేకపోయారు. అలాంటి వ్యక్తి BRSపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రధాని కావాలి అనుకునేవారు ముందు ఎంపీ అయ్యేలా ప్రజల్లో నమ్మకం సంపాదించాలి” అని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. కన్న కూతురినే ఎంపీగా గెలిపించుకోలేని మీరు, డబ్బా కొట్టుకున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా..? ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ..!? అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.