Rahul Gandhi Warning : నో ఢిల్లీ బిజినెస్ , ఓన్లీ ఫీల్డ్‌

`హైద‌రాబాద్ బిర్యానీ, హిరానీ ఛాయ్ బాగున్నాయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌క‌పోతే కుద‌ర‌దు. క్షేత్ర స్థాయిలో ప‌నిచేసే వాళ్ల‌కు మాత్ర‌మే టిక్కెట్లు వ‌స్తాయి. సీనియ‌ర్లైనా స‌రే ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోతే అభ్యర్థిత్వాన్ని ఆశించొద్దు. టిక్కెట్ల‌ను ముందుగా ప్ర‌క‌టించ‌డానికి ఆలోచిస్తాను.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 03:55 PM IST

`హైద‌రాబాద్ బిర్యానీ, హిరానీ ఛాయ్ బాగున్నాయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌క‌పోతే కుద‌ర‌దు. క్షేత్ర స్థాయిలో ప‌నిచేసే వాళ్ల‌కు మాత్ర‌మే టిక్కెట్లు వ‌స్తాయి. సీనియ‌ర్లైనా స‌రే ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోతే అభ్యర్థిత్వాన్ని ఆశించొద్దు. టిక్కెట్ల‌ను ముందుగా ప్ర‌క‌టించ‌డానికి ఆలోచిస్తాను. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త విభేదాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాలి. లేదంటే ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు తీవ్రంగా ఉంటాయి.` అని రాహుల్ గాంధీ లీడ‌ర్ల‌ను హెచ్చ‌రించారు.

గాంధీభ‌వ‌న్లో రాహుల్ గాంధీ లీడ‌ర్ల‌తో స‌మావేశం అయ్యారు. ఆ సంద‌ర్భంగా పార్టీలోని అంత‌ర్గ‌త విష‌యాల‌పై మాట్లాడారు. ఇప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాల‌ని దిశానిర్దేశం చేశారు. మీడియాకు ఎక్క‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంద‌ని ఇష్టానుసారంగా మాట్లాడి మీడియాలో ర‌చ్చ చేసుకోవ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఆర్ఎస్ఎస్ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ ఉండ‌ద‌ని గుర్తు చేశారు.

వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ ను ప్ర‌తి రైతు వ‌ద్ద‌కు తీసుకెళ్లాల‌ని లీడ‌ర్ల‌కు ఆదేశించారు. నెల రోజులు ల‌క్ష్యంగా పెట్టుకుని రైతు డిక్ల‌రేష‌న్ ను తీసుకెళ్లాల‌ని సూచించారు. ప్ర‌తి ఇంటికి వెళ్లాల‌ని అన్నారు. హైద‌రాబాద్ లో కూచుని రాజ‌కీయాలు చేయాలంటే కుద‌ర‌ద‌ని తేల్చేశారు. ఢిల్లీ కి ఎవ‌రూ రావొద్ద‌ని సున్నితంగా మందలించారు. ప్ర‌తి ఒక్క‌రి గురించి డేటా ఉంద‌ని వెల్ల‌డించారు. ప‌నిచేసే వారికి మాత్ర‌మే టిక్కెట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.