Rahul Gandhi: తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుంది: రాహుల్

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది. భారీ మెజారీటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi

New Web Story Copy 2023 06 27t174935.797

Rahul Gandhi: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది. భారీ మెజారీటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసింది. తెలంగాణాలో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పటికీ హైకమాండ్ జోక్యంతో కాస్త సమస్య తగ్గుముఖం పట్టింది. ఇక రాహుల్, ప్రియాంక గాంధీలు తెలంగాణాలో పర్యటనలు చేస్తూ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు మేరకు రేవంత్ రెడ్డి తో సహా కీలక నేతలు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ బాగానే ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు రాహుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎవరెవరు ఎం చేశారో, ఎం చేస్తున్నారో తనకు తెలుసని అన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో అలజడి మొదలైంది.

మంగళవారం ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశంలో భాగంగా రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎవరెవరు ఎం చేశారో, చేస్తున్నారో తన వద్ద పూర్తి డేటా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు రాహుల్. పార్టీలో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ఇంచార్జ్ లేదా నాతో చెప్పుకోవాలని సూచించారు. అలాగే పార్టీ విషయంలో ఎవరూ మీడియా ముందు నోరు జారొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక తుది నిర్ణయం అధిష్టానమే చూసుకుంటుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర నాయకత్వంలో ఉండబోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇక క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీలోని నాయకులు ఐఖ్యతగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

Read More: Jr NTR Emotional: శ్యామ్ మరణం చాలా బాధాకరమైంది, జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్

  Last Updated: 27 Jun 2023, 05:54 PM IST