Rahul Impact: రాహుల్ పర్యటనతో టీ కాంగ్రెస్ లో ఫుల్ జోష్

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం అయ్యిందనే చెప్పాలి. రాహుల్ రెండు రోజుల పర్యటన ఆ పార్టీ నేతల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 10:57 PM IST

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం అయ్యిందనే చెప్పాలి. రాహుల్ రెండు రోజుల పర్యటన ఆ పార్టీ నేతల్లో కొంత ఉత్సాహాన్ని నింపింది. దాదాపు అన్నింటికి రాహుల్ కవర్ చేశాడు. రైతులకు, ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పేశాడు. పార్టీనేతలకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలో ఇచ్చాడు. వీటన్నింటిని చూస్తే రాహుల్ పర్యటన విజయవంతం అయ్యిందనే అంటున్నారు విశ్లేషకులు. ఇక వరంగల్లో రాహుల్ మీటింగ్ జబర్దస్త్ గా జరిగింది. రైతులకు వరాలు వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం గ్యారంటీ అన్నారు. దీంతో ప్రజలతో పాటు పార్టీ నాయకుల్లో కొంత ఉత్తేజం వచ్చింది. రెండో రోజు పర్యటనలో జైళ్లుకు వెళ్లి విద్యార్థలును కలవడం…గాంధీ భవన్ లో అందర్నీ కలిసి మాట్లాడటం…సీనియర్ నాయకులకు సుతిమెత్తగా క్లాస్ పీకడం, వార్నింగ్ లు ఇవ్వడం…ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి.

కాంగ్రెస్ లో కొనసాగుతూ…టీఆరెస్ బీజేపీలతో ఒప్పందాలను చేసేవారు పార్టీకి అక్కర్లేదని రాహుల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి వాళ్లు అసలు పార్టీకి అవసరమే లేదన్నారు. దీంతో చాలా మంది నేతలకు గట్టి షాకిచ్చినట్లయింది. కాంగ్రెస్ లో ఉంటూ టీఆరెస్ కు సానుకూలంగా పనిచేసేవారి లిస్టు ఇప్పుడు అధిష్టానం దగ్గర ఉందట. టీఆరెస్ వాళ్లు కొంతమంది కాంగ్రెస్ నేతలకు జీతాలు ఇస్తూ…టీపీసీసీ చీఫ్ ను ఇబ్బంది పెట్టేటట్లు చేస్తున్నారన్న సమాచారం కూడా హైకమాండ్ వద్ద ఉందట. ఈ కారణంతోకాంగ్రెస్ నేతలుఎవరూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడవద్దని రాహుల్ పబ్లిక్ మీటింగుల్లోనే హెచ్చరించారని అంటున్నారు.

ఇక ప్రజల్లో తిరిగే నాయకులు సీట్లని….ఢిల్లీకి ఎవరూ రావద్దని చాలామంది సీనియర్ నేతలకు రాహుల్ చెప్పేశారట. కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి దాని ప్రకారమే సీట్లు ఇస్తుదని కచ్చితంగా చెప్పారట రాహుల్. అంతేకాదు గెలిచే నాయకులకే పార్టీ సీట్లు ఇస్తుందన్న క్లారిటీ ఇచ్చారట. రాహుల్ మాటలు పార్టీకి అండగా ఉంటూ…పార్టీ కోసమే పనిచేసే నాయకులకు బాగా నచ్చేశాయి. షోప్ టప్ తో బిల్డప్ లు ఇచ్చే కొంతమంది నేతలకు రాహుల్ మాటలు అస్సలు నచ్చడంలేదట.

రైతు డిక్లరేషన్ ప్రతిని తెలంగాణాలోనిప్రతీరైతు…ఇంటింటికి తిరుగుతూ…వారికి అర్థమయ్యేలా వివరించాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు. గాంధీభవన్ లో కాదు మీరు ఉండాల్సింది….ఇంటింటి తిరగాలని రాహుల్ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. మొత్తానికి రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన తెలంగాణా టూర్ పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నింపారని చెబుతున్నారు.