Site icon HashtagU Telugu

Rahul Medigadda Barrage : మేడిగడ్డ వద్ద టెన్షన్ వాతావరణం..

Rahul Mediagadda

Rahul Mediagadda

మేడిగడ్డ (Medigadda Barrage) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు ఉదయం రాహుల్ మేడిగడ్డ బ్యారేజీని (Rahul Gandhi To Inspect Medigadda Barrage ) పరిశీలించారు. రాహుల్ తో పాటు రేవంత్ (Revanth) , భట్టి (Bhatti) , శ్రీధర్ బాబు (Sridhar Babu) తదితరులు బ్యారేజ్ ను పరిశీలించి , రాహుల్ హైదరాబాద్ కు బయలుదేరారు. రాహుల్ రావడంతో భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన భారీ క్రేడ్లను తోసుకుంటూ ప్రజలు మేడిగడ్డ వైపు తరలివస్తుండడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మేడిగడ్డ వైపు వెళ్లే దారులను పోలీసులు మూసేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు మేడిగడ్డకు ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. ప్రత్యేక హెలి క్యాప్టర్‌లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర ల్యాండ్ అయ్యారు రాహుల్ గాంధీ. ఈ తరుణంలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు… రాహుల్‌ గాంధీకి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో అంబటిపల్లికి చేరుకుని.. మహిళా సదస్సులో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ ని పరిశీలించారు రాహుల్ గాంధీ.

Read Also : Mega Heros: వరుణ్- లావణ్య పెళ్ళిలో మెగా హీరోలందరూ ఒకే దగ్గర.. ఫోటో వైరల్..!