Site icon HashtagU Telugu

Rahul Gandhi: తెలంగాణే లక్ష్యంగా రాహుల్ అడుగులు, ఒకరోజు.. ఐదు నియోజకవర్గాలు!

Bharat Jodo Nyay Yatra

Rahul Gandhi Bharat Jodo Yatra Completed one Year Anniversary Celebrations by Congress

Rahul Gandhi: కర్ణాటకలో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నీ తానై జిల్లాల పర్యటన చేస్తుంటే, తాజాగా రాహుల్‌ గాంధీ ఈ నెల 17వ తేదీన వస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆ ఒక్క రోజే అయిదు అసెంబ్లీ నియోజక వర్గాలల్లో పర్యటించబోతున్నారు. రా

హుల్ సుడిగాలి ప్రచారం చేయనున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 17వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యక విమానంలో రాహుల్‌ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుంటారు. ఈనెల 17 మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుల్‌ గాంధీ పినపాకలో రోడ్ షో, కార్నర్ సమావేశం నిర్వహిస్తారు. పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుని రాహుల్‌ గాంధీ 3 గంటల వరకు ప్రచారం చేస్తారు.

నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. అదే రోజుసాయంత్రం 6.30 గంటలకు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ వచ్చి అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. రాహుల్ తోపాటు ముఖ్యనేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. రాహుల్ సభలతో మరింత మైలేజ్ పొందాలని టీకాంగ్రెస్ భావిస్తోంది.

Also Read: Telangana: నవంబర్ 30న ఎన్నికలు.. తెలంగాణలో పబ్లిక్ హాలిడే డిక్లేర్