రేవంత్ రైట్ ఛాలెంజ్..రాహుల్ అండ‌దండ‌లు భేష్

టైం బాగుంటే అన్నీ మ‌న‌కు అనుకూలంగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ణ రేవంత్ ఇంటిపై దాడిని తీసుకోవ‌చ్చు. ఆ దాడి కార‌ణంగా హైద్రాబాద్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వైట్ ఛాలెంజ్ వెళ్లింది.

  • Written By:
  • Publish Date - September 22, 2021 / 02:26 PM IST

టైం బాగుంటే అన్నీ మ‌న‌కు అనుకూలంగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ణ రేవంత్ ఇంటిపై దాడిని తీసుకోవ‌చ్చు. ఆ దాడి కార‌ణంగా హైద్రాబాద్ నుంచి ఢిల్లీ వ‌ర‌కు వైట్ ఛాలెంజ్ వెళ్లింది. అంతేకాదు, రాహుల్ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్ ను డి రామారావు అంటూ సెటైర్ వేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయంగా రేవంత్ టాలెంట్ గాంధీ కుటుంబం వ‌ర‌కు వెళ్లిందంటే మ‌రోసారి పార్టీలోని ఆధిప‌త్యపోరులో విజ‌య‌వంతం సాధించిన‌ట్టే.
మునుపెన్న‌డూ లేని విధంగా తెలంగాణ రాజ‌కీయం కొత్త పుంత‌లు తొక్కుతోంది. వైట్ ఛాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి ఇంటి మీద‌కు కేటీఆర్ అనుచ‌రులు దాడికి దిగ‌డం శోచ‌నీయం. ఛాలెంజ్ ను స్వీక‌రించ‌లేని స్థితిలో రాహుల్ గాంధీ మీద నుంచి రేవంత్ ను కాల్చాల‌ని కేటీఆర్ ప్ర‌య‌త్నించారు. అంతేకాకుండా రేవంత్ ఇంటి మీద‌కు అనుచ‌రుల‌ను ఉసిగొల్ప‌డం తెలంగాణ ప్ర‌జ‌ల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.
వైట్ ఛాలెంజ్ ను స్వీక‌రించ‌లేని ప‌రిస్థితిలో కేటీఆర్ కోర్టు మెట్లు ఎక్కారు. రేవంత్ మీద ప‌రువు న‌ష్టం దావా వేశారు. కోర్టు ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ ఇవ్వ‌డంతో వివాదాన్ని నైస్ గా కేటీఆర్ ముగించారు. కానీ, ప్ర‌జా కోర్టులో మాత్రం ఆయ‌న ఓట‌మి త‌ప్ప‌లేదు. దాన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ అనుచ‌రులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ప్ర‌తిగా రేవంత్ అనుచ‌రులు తిర‌గ‌బ‌డ్డారు. రాళ్ల‌తో త‌రిమికొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఫ‌లితంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసింది.పోలీసులులాఠీ చార్జి చేసేంత వ‌ర‌కు వెళ్లింది.
ఈ మొత్తం సంఘ‌ట‌న వివ‌రాల‌ను రాహుల్ తెలుసుకున్నారు.పీసీసీ అధ్య‌క్షుడు చేసిన ప్ర‌య‌త్నానికి మెచ్చుకుని నైతిక మ‌ద్ద‌తును ట్విట్ట‌ర్ రూపంలో ప్ర‌క‌టించారు. డ్రామా రావు అనే సంకేతం వ‌చ్చేలా కేటీఆర్ ను విమ‌ర్శిస్తూ ట్విట్ట‌ర్లో ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ లోని రేవంత్ అభిమానులు ఊహించని విజ‌యాన్ని అందుకున్న ఫీలింగ్లో ఉన్నారు.రేవంత్ కూడా ఫుల్ హాపీమూడ్ లో పార్టీ కార్య‌క్ర‌మాల్లో బిజీ అయ్యారు. కేటీఆర్ మాత్రం వైట్ ఛాలెంజ్ దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్ర‌జాకోర్టులో మాత్రం కేటీఆర్ పై అనుమాన బీజం బ‌లంగా రేవంత్ నాట‌గ‌లిగారు. సో..రేవంతుడు రాజ‌కీయంగా బ‌ల‌వంతుడే.