Site icon HashtagU Telugu

Rahul Tribal Dance: జోడో జోష్.. రాహుల్ థింసా డ్యాన్స్ అదుర్స్!

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ అగ్రనేత తన భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల్లో జోష్ నింపుతున్నారు. పిల్లలను, పెద్దలను తన యాత్ర ద్వారా ఆకర్షిస్తున్నారు.  ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైపల్యాను ఎండగడుతూ, మరోవైపు ప్రజలకు చేరవవుతున్నారు. గత వారం క్రితం గిరిజనులతో కలిసి కొమ్ము నృత్యం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ ఒడిశా వర్గాల సంప్రదాయ జానపద నృత్యమైన థింసా కు డ్యాన్స్ చేశారు. రాహుల్ గాంధీ ఇతర జానపద కళాకారులతో కలిసి డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేయగా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జగ్గారెడ్డి కూడా జోష్ నింపారు.

అయితే, అక్టోబర్ 29న భద్రాచలంలో గిరిజనులతో కలిసి కొమ్ము కోయలో పాల్గొన్నప్పుడు రాహుల్ గాంధీ గిరిజన తలపాగా ధరించలేదు. ఇటీవల ఓ బాలుడితో క్రికెట్ ఆడిన రాహుల్, తాజాగా డాన్స్ చేసి మరోసారి జోష్ నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ జోడో యాత్ర ఇవాళ సాయంత్రం సంగారెడ్డిలోని శిల్పారామం ఫంక్షన్ హాల్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు శివంపేట గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ యాత్రకు విరామం ఇస్తారు. రాత్రి అందోల్‌లోని సుల్తాన్‌పూర్ గ్రామంలో రాహుల్ గాంధీ బసచేస్తారు.