కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చిన్నారితో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 5తరగతి చదివే యశోవర్ధన్ బ్యాంటింగ్ చేస్తే రాహుల్ బౌలింగ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫీల్డింగ్ చేశారు. టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం సాధించడంతో టీమిండియాను అభినందించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఓ చిన్నారితో ఆడుతున్న వీడియోను జోడించి ట్వీట్ చేశారు. మీరు చూడండి, ఇండియా జెర్సీని ధరించడం మీకు ఏం చేస్తుందో. మిమ్మల్ని అజేయంగా చేస్తుంది. బాగా ఆడింది #TeamIndia!అంటూ ట్విట్ చేశారు. చిన్నారితో క్రికెట్ ఆడిన అనంతరం బ్యాట్ పై సంతం కూడా చేశారు రాహుల్.
You see, what donning the India jersey does to you – makes you unbeatable 😊❤️
Well played #TeamIndia! 🇮🇳 pic.twitter.com/al8kTylXn3
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2022
అయితే అంతకు ముందు రాహుల్ కు ఆ బాలుడు మధ్యతరగతి ప్రజలకు భారమైన ప్రైవేటు విద్య పై వినతిపత్రం అందచేశాడు. మీరు ప్రధాని అయితే ప్రైవేట్ స్కూలు
ఫీజులపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చూడాలని ..ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరచాలని కోరారు. సానుకూలంగా స్పందించిన రాహుల్ ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పై ఆటోగ్రాఫ్ చేశారు. కాగా రాహుల్ జోడో యాత్ర మంగళవారం ఉదయం హైదరాబద్ లోకి ప్రవేశించింది. మంగళవారం చార్మినార్ వద్ద రాహుల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో కార్నర్ మీటింగ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోసాగుతున్న రాహుల్ యాత్రకు పెద్దెత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.