Site icon HashtagU Telugu

Rahul Gandhi : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ

Rahul Gandhi letter to CM Revanth Reddy

Rahul Gandhi letter to CM Revanth Reddy

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణలో వేముల రోహిత్ చట్టాన్ని అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో కోరారు. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ లేఖలో సూచించారు.

Read Also: Nizamabad : రైతు మహోత్సవ వేడుకల్లో అపశ్రుతి..మంత్రులకు తప్పిన ప్రమాదం

ఇక ఈ లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ ఏం ఆలోచించినా ప్రజల కోసమే ఆలోచిస్తారని అన్నారు. రోహిత్ చట్టం తేవాలని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. రోహిత్ చట్టంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం నాడు ఎంపీ చామల కిరణ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పిట్టల దొర, కేటీఆర్ తుపాకీ రాముడని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేసిన తప్పులకు రజతోత్సవ సభలో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేటీఆర్ మళ్లీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలను స్మరించుకున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఏముందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రజతోత్సవ బ్యానర్‌లో బీఆర్ఎస్ అని ఉంటుందా.. టీఆర్ఎస్ అని ఉంటుందా అని నిలదీశారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వనున్నట్లు సమాచారముందని అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ కులగణన ఫలితమే బీఆర్ఎస్ పార్టీ బీసీని అధ్యక్షుడిగా నియమిస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

గాంధీ, నెల్సన్ మండేలా లాగా కేసీఆర్ ఫీల్ అవుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి చేసేదేముందని ప్రశ్నల వర్షం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కురిపించారు. తుపాకీ రాముడు కేటీఆర్ బాధ ఏంటో అర్థం కావడం లేదన్నారు. భారీ డైలాగులు కొట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కళ్లముందు జరిగిన చరిత్రను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Read Also: Fake Currency : ఆ నోట్లతో అప్రమత్తంగా ఉండాలి కేంద్ర హోంశాఖ హెచ్చరికలు