Site icon HashtagU Telugu

Harish Rao: కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్ రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao

Minister Harish Rao

Harish Rao: కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మంత్రి హరీశ్ రావు మీడియానుద్దేశించి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీ అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని, తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

‘‘కర్ణాటక లో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. కర్ణాటక లో ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదు. కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారు. అయిదు గ్యారంటీ లని చెప్పిన కాంగ్రెస్ ప్రజలకు రాం రాం చెప్పారు. ఎన్నికలప్పుడు ఓడ మల్లప్ప ,ఎన్నికలు ముగియగానే బోడ మల్లప్ప అన్నట్టుగా ఉన్నది రాహుల్ గాంధి తీరు. కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తవుతుంది. కర్ణాటక ఎన్నికలపుడు గ్యారంటీల ప్రారంభానికి కాలపరిమితి పెట్టిన రాహుల్ గాంధీ ఇపుడు రకరకాల షరతులను పెడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారు’’ హరీశ్ రావు మండిపడ్డారు.

‘‘విద్యార్థుల స్కాలర్ షిప్ లు ఇవ్వటం లేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. స్కాలర్ షిప్ లు ఇవ్వకుండా కోత పెట్టీ కార్మికుల పిల్లల చదువుకు దూరం చేస్తోంది. తెలంగాణ లో కాంగ్రెస్ రంగు రంగుల ప్రపంచం చూపుతోంది. కర్ణాటక ప్రజా ప్రతినిదుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి ఎమ్మెల్యేలుఅడుగుతున్నారు. వెలుగుల దీపావళి కావాలా? కర్ణాటక లాంటి చీకటి కావాలా?  తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి’’ అని హరీశ్ రావు అన్నారు.

‘‘ఆరు నెలల్లో అక్కడ 357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ తెలంగాణ లో రైతు ఆత్మహత్యకు తగ్గాయి. తెలంగాణలో మేము  రైతులం అని గర్వంగా చెప్పుకుంటున్నారు. గెలిచే దాకా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటారు., ఆ తర్వాత excuse me please అంటారు. ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి. కర్ణాటక పరిస్తితి తెలంగాణ కు కావాలా? కర్ణాటక ఫెయిల్యూర్ మోడల్ రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు. కర్ణాటక ప్రజల్లగా తెలంగాణ ప్రజలు మోసపోరు.’’ అని హరీశ్ రావు అన్నారు.