Site icon HashtagU Telugu

Rahul Gandhi: అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను కలిసిన రాహుల్ గాంధీ.. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా..!

Rahul Gandhi

Compressjpeg.online 1280x720 Image 11zon

Rahul Gandhi: ఐదు రాష్ట్రాలలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఒకే రాష్ట్రం మిగిలి ఉంది. అదే తెలంగాణ. ఇప్పుడు బీజేపీ-కాంగ్రెస్ సహా అన్ని జాతీయ రాజకీయ పార్టీల దృష్టి తెలంగాణపై పడింది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారం అశోక్ నగర్ లోని నిరుద్యోగులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాజధాని హైదరాబాదులోని అశోక్ నగర్‌లో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమై పలు సమస్యలపై మాట్లాడారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం పలు నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న నిరుద్యోగులను రాహుల్ కలిశారు. కాసేపు వారితో ముచ్చటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ యువతకు హామీ ఇచ్చారు. ఇది కేవలం హామీ మాత్రమే కాదు, కాంగ్రెస్‌ గ్యారెంటీ అని స్పష్టం చేశారు.

Also Read: Music Festival : యూనివర్శిటీ మ్యూజిక్ ఫెస్టివల్ లో దారుణం.. నలుగురు మెడికోలు మృతి

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విధంగా పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి. అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండరును వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని శనివారం రాత్రి ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

We’re now on WhatsApp. Click to Join.