Site icon HashtagU Telugu

Rahul Gandhi : పొత్తు గురించి మాట్లాడే  నేతలు మాకు అక్కర్లేదు-రాహుల్ గాంధీ..!!

rahul gandhi

rahul gandhi

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు వెలుగుచూస్తాయో చెప్పడం కష్టం. ఈ రోజు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నా….రేపు చేతులు కలిపే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు గతంలో ఎన్నో చూశాం. ఈ క్రమంలోనే తెలంగాణలో పొత్తుల చర్చలు షురూ అయ్యాయి. అయితే కాంగ్రెస్ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.

ఆయన ఈ విషయాన్ని రైతు సంఘర్షణ సభలో ధృవీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరితోనూ చేతులు కలపదని…తెలంగాణను దోచుకున్న వారితో పొత్తులు పెట్టుకోమని క్లారిటీ ఇఛ్చారు. అక్కడిదాకా ఎందుకు…పొత్తు గురించి కాంగ్రెస్ నేతల్లో ఎవరూ మాట్లాడినా…పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు రాహుల్. టీఆరెస్ తో గానీ, బీజేపీ తో గానీ పొత్తు కోరుకునే కాంగ్రెస్ నేతలు…ఆ పార్టీల్లోకి వెళ్లిపోవచ్చన్నారు. అలాంటి నేతలు కాంగ్రెస్ అవసరం లేదని చెప్పారు రాహుల్.

అంతేకాదు  కాంగ్రెస్ విధానాలను విమర్శించినా…సహించిలేదని హెచ్చరించారు. ఎంత పెద్ద వారైనా సరే పార్టీ నుంచి బయటకు నెట్టేస్తామని రాహుల్ డైరెక్టుగానే వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో టికెట్ ప్రస్తావన వచ్చినప్పుడు…తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేసిన వారికే..మెరిట్ ఆధారంగా టికెట్ ఇస్తామన్నారు. ఎంత పెద్దవారైనా..రైతులు తరపున, పేద ప్రజల పక్షాన, యువత ఉద్యోగం కోసం పోరాటం చేయరో వారికి టికెట్ ఇచ్చే ప్రస్తక్తే లేదని తేల్చేశారు.

Exit mobile version