కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Tour) శుక్రవారం పర్యటన లో మార్పులు జరిగాయి. గత రెండు రోజులుగా తెలంగాణ (Telangana) లో రాహుల్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న భూపాలపల్లి లో పర్యటించిన రాహుల్..నేడు బోధన్ (Bodhan ), నిజామాబాద్ (Nizamabad) లో పర్యటించాల్సి ఉంది. కానీ రాహుల్ గాంధీ ఆ రెండు పర్యటనలు రద్దు (Rahul Bodhan Nizamabad Tours Cancel) చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో రాహుల్ తన పర్యటనలో మార్పులు చేసారు. బోధన్ లో బీడీ కార్మికులు, షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, గల్ఫ్ కార్మికులతో సమావేశం కావాల్సి ఉంది. ఆ తర్వాత ఆర్మూర్ కు వెళ్లాలి. కానీ ఇప్పుడు రాహుల్ నేరుగా ఆర్మూర్ కు వెళ్లనున్నారు.
ఉదయం 9గంటలకు చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద సమావేశంలో రాహుల్ పాల్గొంటారు. ఉదయం 9:30 గంటలకు కొండగట్టు వెళ్లి అంజన్నను దర్శించుకుంటారు. 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, ఒంటిగంటకు కోరుట్లలో ప్రచారం చేస్తారు. అనంతరం 2:30 గంటలకు ఆర్మూర్ బహిరంగ సభలో పాల్గొని , ఢిల్లీకి వెళ్లనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న భూపాలపల్లి రాహుల్ మాట్లాడుతూ..కుల గణన అనేది దేశానికి ఎక్స్ రే లాంటిది. దేశంలో కుల గణన చేపడితేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి అన్నారు. దేశంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఆఫీసర్లలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్లు ఉన్నారో చెప్పాలని నేను పార్లమెంట్ లో ప్రశ్నించాను. అన్ని శాఖల్లో కలిపి కేవలం కేవలం 5 శాతం మంది మాత్రమే ఈ మూడు వర్గాలకు చెందినోళ్లు ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలి అన్నారు.
అలాగే తెలంగాణ లో దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమైన అధికారులు ఉంటే.. మరోవైపు ప్రజలు ఉన్నారని చెప్పారు. దళితులను, గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, రూ.లక్ష రుణమాఫీ.. ఇలా కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరే ఇందుకు నిదర్శమన్నారు. తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ మీటింగ్‌లోనే తొలి సంతకం చేసి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Also : Indrakeeladri : కుటుంబసమేతంగా బెజవాడ దుర్గమ్మని దర్శించుకున్న ఎంపీ కేశినేని నాని