Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది

Published By: HashtagU Telugu Desk
Rahul Phonetaping

Rahul Phonetaping

తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ (Telangana Phone Tapping) వ్యవహారం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో కొంతమంది బిఆర్ఎస్ నేతల సూచనల మేరకు పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిందితులు తెలుపడం తో ఈ వ్యవహారం గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే అంశంపై ఈరోజు తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ‘జనజాతర ‘ పేరిట భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య వేదికగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. అలాగే పలువురు కీలక నేతలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఇక తుక్కుగూడ జనజాతర సభ వేదికగా, ఐదు గ్యారెంటీలను ఆవిష్కరించిన రాహుల్‌ రైతులు, యువత, మహిళల సహా అందరికీ అండగా ఉంటామని తెలుపుతూ…రాష్ట్రంలో కీలకంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

‘గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది. ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేశారు. తెలంగాణ మాజీ సీఎం ఎలాంటి పని చేశారో ఢిల్లీలో ప్రధాని కూడా అదే పని చేస్తున్నారు. బీజేపీ ఓ వాషింగ్ మెషీన్. దేశంలో అత్యంత అవినీతిపరులు మోడీతో ఉన్నారు. ఎన్నికల సంఘంలోనూ మోడీ తొత్తులున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. అలాగే ఎలక్టోరల్ బాండ్స్ ఫై కూడా రాహుల్ స్పందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ అని రాహుల్ పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో ..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ని అలాగే ఓడించాలి అని రాహుల్ పిలుపునిచ్చారు. జూన్‌ 9న ఢిల్లీ లో మువ్వెన్నల జెండా ఎగరాలి అన్నారు.

Read Also : Bitter experience for Dhoni fan : ఉప్ప‌ల్‌లో ధోని ఫ్యాన్‌కు చేదు అనుభవం.. నా సీటెక్క‌డ ? డ‌బ్బులిచ్చేయండి

  Last Updated: 06 Apr 2024, 09:01 PM IST