Site icon HashtagU Telugu

Ragging : బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్..ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు..!!

Basara

Basara

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను సీరియర్లు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగిపిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.

గత కొన్నాళ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల హామీ నిరసన విరమించుకున్నారు. ఇప్పుడు ర్యాగింగ్ కలకలం రేపడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

Exit mobile version