Site icon HashtagU Telugu

Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Raghunandan Rao,

Raghunandan Rao,

Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ క్రెడిబులిటీ లేని పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ నేత మాట్లాడిండు అంటున్న కాంగ్రెస్ నేతలు.. పంచాయితి స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. సిక్కులకు భద్రత లేదు అని అమెరికాలో వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ వ్యక్తి గత విషయాలు బీజేపీ పార్టీ ఎప్పుడు అడగలేదన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మీహయాంలోనే సిక్కుల ఉచకొత జరిగిందని, మీ కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేసిన వ్యక్తే మీ గురించి వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. మీ చరిత్ర తెలిసిన నాయకుడే ఈ వ్యాఖ్యలు చేసాడని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. ఢిల్లీలో – గల్లీలో కాంగ్రెస్ పరిస్థితి సేమ్ ఉందని, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మడం లేదన్నారు రఘునందన్‌ రావు.

దానం నాగేందర్ ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదికలు ఇచ్చాడని, బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అని అఫిడవిట్ ఇచ్చారన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటని, వరంగల్ జిల్లాలో కూడా ఒక పార్టీ మారిన నేత ఉన్నాడన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిసి అసభ్య పదజాలం వాడటం సిగ్గుచేటని, ఇద్దరు ఎమ్మెల్యేలు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. ట్విట్టర్ టిల్లుకు ఆశ్చర్యం వేసింది అంటా.. ఎమ్మెల్యే ఇంటికీ వచ్చి ఎలా దాడి చేస్తారు అంటున్నాడు ట్విట్టర్ టిల్లు. వరంగల్ జిల్లాలోనే అప్పటి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ అయిన వారిపై దేవరుప్పుల మండలం నుండి మొదలుపెడితే.. జిల్లాలో పాదయాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లో దాడి చేసారు ఆయన గుర్తు చేశారు. సూర్యాపేటలో రైతుల కోసం పోతే దాడి చేసారని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఇదే వరంగల్‌లో పింకీలు కోడిగుడ్లతో దాడి చేసారంటూ రఘునందన్‌ రావు విరుచుకుపడ్డారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిలు అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు విగ్రహాలు పెట్టేది లేదు. కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలంటూ రఘునందన్‌ రావు అన్నారు.

Read Also : Kaleshwaram Commission : సెప్టెంబర్ 19 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ