Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కవిత తన ప్రెస్‌మీట్‌లో కొత్తగా ఏమీ చెప్పలేదని, ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. రఘునందన్ రావు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహారాలపై తాను మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. అయితే, కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్ట్ అవకతవకలపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ నేతలైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని ఆయన కోరారు.
Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య గతంలోనే కుమ్మక్కు ఉందని తాను చెప్పానని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఇది రాజకీయంగా ఆసక్తికరమైన అంశమని ఆయన పేర్కొన్నారు. రఘునందన్ రావు గతంలో కేసీఆర్‌కు చెప్పిన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో తాను కేసీఆర్‌కు చెప్పినా, ఆరోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే, మెదక్ ఎంపీ ఎన్నికలలో ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు కూడా గతంలో చెప్పానని తెలిపారు.
కవిత ప్రెస్ మీట్ తో బీఆర్‌ఎస్ పార్టీ అవినీతి పునాదుల మీద నిలబడిందని తేటతెల్లమైందని రఘునందన్ రావు అన్నారు. భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్‌లలో బీఆర్‌ఎస్ నేతలు చేసిన అవినీతిని బయటపెడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.
Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం