Site icon HashtagU Telugu

Traffic Restrictions: తెలంగాణ `డే` ట్రాఫిక్ ఆంక్ష‌లు

Taffic Police

Taffic Police

హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలను హైదరాబాద్ పోలీస్ కమీషన్ CV ఆనంద్ తెలియజేశారు. జూన్ 2, 2022 ఉదయం 7:30 నుండి 11 గంటల వరకు ఆంక్షలు వర్తిస్తాయి. ఈ సమయంలో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు.

ట్రాఫిక్ మళ్లింపులు

తాజ్ ఐలాండ్ వద్ద, MJ మార్కెట్ నుండి వచ్చే మరియు పబ్లిక్ గార్డెన్స్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ అనుమతించబడదు. ఆ ట్రాఫిక్ ను ఏక్ మినార్ – భజార్ఘర్ – ఆసిఫ్ నగర్ / రెడ్ హిల్స్- అయోద్య హోటల్ మరియు లక్డికాపూల్ వైపు మళ్లించబడుతుంది.

నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి వచ్చే ట్రాఫిక్. చాపెల్ రోట్ టి జంక్షన్ వద్ద గన్‌ఫౌండ్రీ – అబిడ్స్ లేదా బిజెఆర్ విగ్రహం మరియు బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు మళ్లించారు. నిరంకారి భవన్ మరియు ఖైరతాబాద్ నుండి రవీంద్ర భారతి వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు. ఆ ట్రాఫిక్ ను సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ వద్ద టెలిఫోన్ భవన్ – ఇక్బాల్ మినార్ – సచివాలయం వైపు మళ్లించబడుతుంది.

రోడ్డు- తెలుగు తల్లి – అంబేద్కర్ విగ్రహం – లిబర్టీ – బషీర్‌బాగ్ మరియు అబిడ్స్, బ‌షీర్‌బాగ్ జంక్షన్ వద్ద, హైదర్‌గూడ, కింగ్ కోటి మరియు బిజెఆర్ విగ్రహం నుండి పిసిఆర్, పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. దాన్ని బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ – తెలుగు తల్లి – ఎన్టీఆర్ మార్గ్ – ఇక్బాల్ మినార్ – ఓల్డ్ పిఎస్ సైఫాబాద్ – లక్డికాపూల్ వంతెన వైపు మళ్లిస్తారు.