R Narayana Murthy : కేసీఆర్ భోళా శంకరుడు అంటూ పీపుల్స్ స్టార్ ప్రశంసలు

గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్‌ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి

Published By: HashtagU Telugu Desk
R Narayana Murthy Praises C

R Narayana Murthy Praises C

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy)..సీఎం కేసీఆర్ ఫై ప్రశంసలు జల్లు కురిపించారు. కేసీఆర్‌ డిక్టేటర్‌లా కనిపిస్తాడు కానీ.. భోళా శంకరుడు అంటూ తన అభిమానం , ప్రేమను వ్యక్తం చేసారు. విప్లవ ప్రధానమైన సినిమాలు ఎన్నో చేసి పీపుల్స్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్. నారాయణమూర్తి..ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆడియన్స్ ట్రెండ్ మారింది. దానికి తగ్గట్లు సినిమాలు చేయలేకపోతున్నారు ఆర్. నారాయణమూర్తి. అయినప్పటికీ అప్పుడప్పుడు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక సీఎం కేసీఆర్ (CM KCR) ఫై నిత్యం అభిమానం కనపరుస్తూ వచ్చే ఆర్. నారాయణమూర్తి…తాజాగా మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దశాబ్దం కిందటి వరకు తెలంగాణ (Telangana) వెనుకబడటానికి కారణం నీళ్లు లేకపోవడమే! నీళ్లు లేక.. పంటలు పండక పల్లెలు ఛిద్రమయ్యాయి. ఆత్మగౌరవం అడుగంటింది. ఆ దశలో కేసీఆర్‌ గారు ప్రత్యేక తెలంగాణ సాధన కోసం నడుం బిగించారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం ఈ మహోన్నత లక్ష్యాలు సాధించాలనే సంకల్పంతో అడుగు ముందుకు వేశారు. పుష్కర కాలం అలుపెరగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారు అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కెనడాలో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ఆ రికార్డును అధిగమించింది. కెనడాలోని ప్రాజెక్ట్‌ను ఓ దేశం నిర్మిస్తే… కాళేశ్వరాన్ని కేంద్రంతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా నిర్మించుకుంది. ఇదొక అరుదైన అచీవ్‌మెంట్‌. కేవలం మూడున్నరేండ్లలో ఈ స్థాయి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనంగా చెప్పొచ్చు అన్నారు.

గతంలో ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత పార్టీ వాళ్ల మధ్యే ఘర్షణలు, హైకమాండ్‌ ఆధీనంలో రాష్ట్ర పరిపాలన ఉండటంతో రాజకీయ అనిశ్చితి కనిపించేది. శాంతిభద్రతలు కూడా గాడి తప్పేవి. ఈ రోజు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ పదేండ్లలో చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోలేదు. ప్రజలంతా సేఫ్‌గా ఉన్నారు. గంగా జమునా తెహజీబ్‌ అన్న చందంగా నేడు ఇక్కడి ప్రజలు ఆనందంగా ఉన్నారు. సమాజంలోని ప్రతి మనిషీ శాంతి, స్వేచ్ఛ, సుస్థిరత కోరుకుంటారు. ఇవాళ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సమాజం మొత్తం శాంతియుతంగా జీవనం సాగిస్తున్నది అని మూర్తి అన్నారు.

Read Also : CM KCR: ఈ నెల 9న కామారెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!

  Last Updated: 04 Nov 2023, 02:22 PM IST