Site icon HashtagU Telugu

Caste census Survey : ‘కులగణన’ సమావేశంలో ఆర్. కృష్ణయ్య..

R Krishnaiah In Caste Censu

R Krishnaiah In Caste Censu

రేవంత్ సర్కార్‌ (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే (Caste census Survey) నవంబర్ 6 నుంచి మొదలుకాబోతుంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ సచివాలయంలో దీనిపై సమావేశం ఏర్పాటు చేసారు. మంత్రి శ్రీధర్ బాబు చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, షాద్‌నగర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) కులగణనపై సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా కృష్ణయ్య మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, తదితురులకు ఈ సందర్భంగా శాలువ కప్పి సత్కరించారు.

ఇక ఆర్ కృష్ణయ్య ఈ మధ్యనే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీసీల తరఫున పోరాటం చేస్తారని వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మీకు ఆ పదవి కేటాయిస్తే..ఇంకో నాలుగేళ్ళ పదవి కాలం ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేసి జగన్ కు షాక్ ఇచ్చారు. అయితే ‘జగన్ కు నష్టం చేయాలని కాదు.. నా 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవి. దాని వల్ల నాస్థాయి తగ్గింది’ అని కృష్ణయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణయ్య దారి ఎటు అనేది తెలియడం లేదు. మరి ఈరోజు కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనడం..సలహాలు , సూచనలు అందజేయడం తో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారా..? అని అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Kasthuri Shocking Comments : నటి కస్తూరి కామెంట్స్ ఫై పొంగులేటి ఆగ్రహం