Pushpa-2 Controversy: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 (Pushpa-2 Controversy) మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో ఆయన పలు విషయాల గురించి ప్రస్తావించారు. స్మగ్లర్స్ వ్యవస్థకు.. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి క్రూరమైన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తూ, హింసాయుత నేర ప్రవృత్తిని “తగ్గేది లేదు” అని డైలాగులు కొడుతూ ప్రోత్సహించి, హీరో వర్షిప్ప్‌ను యువకులలో కల్పించేవిధంగా “పుష్ప” సినిమాను తీశారు. ఆ బడుద్ధాయి సినిమాకు రాయతీలు ప్రకటింటి ప్రజలపై భారం మోపడానికి నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అసలు మొదటి ముద్దాయి. ఏదైనా సందేశమాత్మక చిత్రానికి రాయితీలివ్వవచ్చు.. ఎందుకంటే ఈ అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరణ యివ్వరుగనుక అని రాసుకొచ్చారు.
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా? పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చొని చూడగలవా? లేస్తే ఒకసారి, కూరుచుంటి వికాసారి అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనం? ఏ తెలుగు భాషకు, యాసకు ఆదర్శం? ప్రముఖ సినిమా ఆదర్శ నటులు “అల్లు” తరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడమా? మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోడానికి తెగించి ఆమె బలైపోతే, అందులో ఆమె సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చిందే తప్ప హీరోను చూడడానికి రాలేదు. చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడేచ్చేమోగాని రాజకీయనాయకులు అంత కక్కుర్తి పడాలా? అని విమర్శించారు.
Also Read: Rohit Sharma: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మకు గాయం!
సభ్యసమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు, సాహితీవేత్తలు, సామజిక స్పృహ వున్నవాళంతా ముక్త కంఠంతో ఖండించాలి. బాధిత కుటుంబానికి పుష్ప యాజమాన్యం యిచ్చే ముదనష్టపు ఆర్థిక సాయాన్ని తిరస్కరించాలి. ప్రభుత్వం, సభ్యసమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో మావంతు ప్రకటిస్తాను అని ఆయన పేర్కొన్నారు.