Site icon HashtagU Telugu

Five Government Jobs : హ్యాట్సాఫ్ మమత.. ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్

Five Government Jobs

Five Government Jobs

Five Government Jobs : విజయం అంటే ఇదే.. గ్రామీణ నేపథ్యం కలిగిన ఆ యువతి ఒకేసారి ఐదు గవర్నమెంట్ జాబ్స్ సాధించి సత్తా చాటుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రికి చెందిన పుప్పాల మమత ఈ ఘనత సాధించింది. వారిది వ్యవసాయ కుటుంబం. పుప్పాల మమత తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమ దంపతులు. తమ కుమార్తెకు ఒకేసారి ఐదు జాబ్స్ వచ్చాయని తెలిసి వారు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బీఈడీ, ఎం.కాం. పూర్తి చేసిన మమత.. ప్రభుత్వ ఉద్యోగాలకు (Five Government Jobs) ప్రిపేర్ అవుతూనే సిరిసిల్ల గురుకుల డిగ్రీ కళాశాలలో కొద్దికాలంగా కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Old City Lac Bangles : హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు

ప్రవీణ్‌కు మూడు గవర్నమెంట్ జాబ్స్

ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఆర్‌సీలో నైట్‌ వాచ్‌మెన్‌ ఉద్యోగం చేస్తున్న యువకుడు ప్రవీణ్‌ ఒకేసారి మూడు గవర్నమెంట్ జాబ్స్ సాధించి అందరితో భళా అనిపించారు. సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలో ఒకేసారి టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలను ఆయన సాధించారు. మంచిర్యాల జిల్లా పొనకల్‌ మేజర్‌ పంచాయతీ గ్రామమైనా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంగా ఉండేవికావు. ప్రవీణ్ అమ్మానాన్నలు చదువుకోలేదు. నాన్న తాపీ మేస్త్రీగా, అమ్మ బీడీలు చుట్టే కార్మికురాలు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాక బీకాం కోర్సు చేయడానికి 2013లో హైదరాబాద్‌కు ప్రవీణ్ చేరుకున్నాడు. ఓయూలో బీకాం, ఎంకాం చేశాడు. టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తారేమోనన్న ఆశతో బీఈడీ కూడా పూర్తిచేశాడు. టెట్‌ పాసయ్యాడు. తర్వాత డీఎస్సీ ఎగ్జామ్ రాశాడు. కేవలం అరశాతం మార్కుతో ఉద్యోగం చేజారింది. ఆరునెలల పాటు చదువుకోకుండా గమ్యంలేకుండా క్యాంపస్‌లో తిరిగాడు. క్యాంపస్‌లో ఐదేళ్ల క్రితమే చదువు పూర్తయ్యింది. కొద్దిరోజులు పస్తులున్నా ఓ స్నేహితుడి ద్వారా క్యాంపస్‌లోని ఈఎంఆర్‌సీలో నైట్‌వాచ్‌మెన్‌ ఉద్యోగంలో ప్రవీణ్ చేరాడు. నెలకు రూ.6వేలు శాలరీ ఇచ్చారు. అక్కడున్న అధికారులు ప్రవీణ్ గురించి తెలుసుకుని ఓ గది కేటాయించారు. అందులో ఉంటూ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ కావాలని ప్రోత్సహించారు. నైట్ వేళ వాచ్‌మన్‌గా డ్యూటీ.. పగటిపూట ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్‌ను ప్రవీణ్ కంటిన్యూ చేశాడు. ఆ శ్రమకు ఫలితంగానే ఆయనకు ఒకేసారి మూడు గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి.