Punjab CM visit Telangana: నేడు పంజాబ్ సీఎం తెలంగాణలో పర్యటన

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో (Telangana) ఈరోజు పర్యటించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Punjab CM visit Telangana today

Punjab Cm

పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో ఈరోజు పర్యటించనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి గజ్వేల్ కి బయలుదేరుతారు. కొండపోచమ్మ రిజర్వాయర్, మల్లన్నసాగర్, మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువును ఆయన పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాజెక్టు వల్ల భూగర్భజలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం (Punjab CM) బృందానికి అధికారులు తెలియజేయనున్నారు.

భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను భగవంత్ మాన్ బృందం పరిశీలించనుంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్ ల నిర్మాణం తదితర పనులను అధ్యయనం చేయనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగిరానున్నపంజాబ్ సీఎం.

Also Read:  Petrol Rate in Pakistan: పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలుసా?

  Last Updated: 16 Feb 2023, 11:20 AM IST