Pulla Reddy Issue: రాష్ట్రపతి వద్దకు ‘పుల్లారెడ్డి’ పంచాయితీ!

పుల్లారెడ్డి (Pullareddy) కుటుంబ పంచాయితీ రాష్ట్రపతి ముర్ము వద్దకు చేరుకుంది.

  • Written By:
  • Updated On - December 27, 2022 / 04:38 PM IST

పుల్లారెడ్డి ఫ్యామిలీ (Pulla Reddy Family)లో తరచుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్లారెడ్డి స్వీట్ అధినేత రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (President Murmu) లేఖ రాశారు. తన అత్తమామలపై లేఖలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రపతి ముర్ము ఈనెల 29న నారాయణమ్మ కాలేజ్‌ను సందర్శించనున్నారు. ఈ కాలేజ్‌ను నిర్వహిస్తున్నది పుల్లారెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అతడి కుటుంబ సభ్యులే. రాఘవరెడ్డి కుమారుడు ఏక్‌నాథ్ రెడ్డితో 2014లో ప్రజ్ఞారెడ్డికి వివాహం జరిగింది. ఈమె తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. వివాహం తర్వాత కొద్దికాలానికి ఏక్‌నాథ్ రెడ్డి, ప్రజ్ఞారెడ్డి మధ్య గొడవలు మొదలయ్యాయి.

తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ అత్తింటి వారిపై ప్రజ్ఞారెడ్డి గతంలో పంజాగుట్ట (Punjagutta) పీఎస్‌లో కేసు పెట్టారు. ఆ సమయంలో తాము, తన కుమార్తె బయటకు రాకుండా రాత్రికి రాత్రి గదికి అడ్డంగా గోడ కూడా కట్టేశారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత గోడను తొలగించిప్పటికీ అనేక ఇతర మార్గాల్లో తనను వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి చెబుతున్నారు. నారాయణమ్మ కాలేజ్‌ను సందర్శిస్తున్న రాష్ట్రపతి (President Murmu) ఒక మహిళగా తన పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు. రెండేళ్లుగా వేధిస్తున్నారని.. మే నెల నుంచి ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వెల్లడించారు. తన కుమార్తెను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా తాను పోరాటం చేస్తున్నానని.. కోర్టు నుంచి తనకు ఊరట లభిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Kerala Bride: ఢోలుతో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్