Site icon HashtagU Telugu

Public Talk : పేరు కాదు మార్చేది రాష్ట్ర అభివృద్దని ఇంకాస్త పెంచండి

Ts Tg Talk

Ts Tg Talk

తెలంగాణ (Telangana ) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేస్తూనే..మరోపక్క కొన్ని తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..TSPSC లో జీవో నంబర్‌ 46 ను రద్దు చేయాలంటూ నిరుద్యోగ యువత ఆందోళల చేస్తుంది.

ఇదిలా ఉంటె తాజాగా ఆదివారం జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోగా..వాటిలో TS ను TG మారుస్తున్నట్లు ( Telangana Name From TS to TG Change) తీసుకున్న నిర్ణయం ఫై ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు శాశ్వతం కాదు..ఒకే పార్టీ ఏళ్ల తరబడి రాష్ట్రాన్ని పాలించదు. ప్రజలు నిత్యం మార్పు కోరుకుంటారు. ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో..?ఆ పార్టీ వస్తే ఏంచేస్తుందో..? ఒక్కసారి వారికీ ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏమాత్రం అభివృద్ధి చేస్తారో..? అంటూ ప్రజలు లెక్కలు వేసుకుంటుంటారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బిఆర్ఎస్ ను విశ్రాంతి తీసుకొమ్మని కాంగ్రెస్ కు పట్టం కట్టారు. చూద్దాం వీరు ఎంత అభివృద్ధి చేస్తారో..ప్రజలు ఎంత మేలు చేస్తారో ..అని అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొన్ని మార్పులు చేర్పులు చేయడం ప్రజల్లో ఆగ్రహం పెంచుతుంది. ప్రస్తుతం వాహనాలకు ఉన్న TS ను కాస్త TG మారుస్తున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. పేరు మారిస్తే ఏముంది..రాష్ట్రాన్ని మీరు ఎంత అభివృద్ధి చేస్తారో నిరూపించండి..ప్రజలకు ఎలాంటి సదుపాయాలు అందజేస్తారో చెప్పండి..ప్రజలు కోరుకుంటున్న తెలంగాణను తీసుకురండి..నిత్యావసర ధరలు తగ్గించండి..రాష్ట్రాన్ని అప్పులనుండి బయట పడేలా చెయ్యండి..నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించండి..కొత్త ప్రాజెక్టులు కట్టండి..ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేసి గత ప్రభుత్వం కంటే మీమే బెటర్ అని నిరూపించుకోండి అంతే తప్ప..ఆ ప్రభుత్వం ఆ పేరు పెట్టింది..ఆ పాట పెట్టింది..మీము మారుస్తాం…మాకు అది నచ్చలేదు అన్నట్లు మార్చుకుంటూ పోతే..గత ప్రభుత్వానికి , మీ ప్రభుత్వానికి తేడా ఏముంది..ఇద్దరు ఒక్కటే కదా..పేరు మార్చడం కంటే ..మీ గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియజేసి శభాష్ కాంగ్రెస్ అనిపించుకోండి. అంతే కానీ పేర్లు మార్చుకుంటూ వెళ్ళకండి..దానివల్ల ప్రజలకు నష్టం , ఇబ్బందే తప్ప మరోటి లేదని ప్రజలు అంటున్నారు.

Read Also : Fiji Deputy PM : 8న అయోధ్యను సందర్శించనున్న తొలి విదేశీ నేత