తెలంగాణ ఎన్నికల ప్రచారానికి (Election Campaign) రేపటితో శుభం కార్డు పడనుంది. దీంతో నేతలంతా భాగ్యనగరం (Hyderabad) ఫై పడ్డారు. గల్లీ నేతల దగ్గరి నుండి ఢిల్లీ నేతల వరకు అంత నగరంలో రోడ్ షో లు , కార్నర్ మీటింగ్ లు , సభలు , సమావేశాలతో హోరెత్తించడం తో నగరంలో ఎక్కడిక్కడే ట్రాఫిక్ స్థంభించింది. గంటకు పైగా ట్రాఫిక్ లో నగరవాసులు అల్లాడిపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు నగరంలోని ప్రధాన రూట్‌లలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రోడ్డు, సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వెళ్లే రోడ్లపై పూర్తిగా స్థంభించింది. కిలో మీటర్ దూరం వెళ్లడానికి సుమారు గంట సమయంపైగా పట్టడంతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చేసుకుంటే మధ్యాహ్నం సమయంలో చేసుకోవాలి కానీ..అంత ఆఫీస్ లనుండి ..పనులు పూర్తి చేసుకొని ఇంటికి పోయే టైములో చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కష్టాలు తీర్చాలి కానీ..కష్టాలు పెట్టకూడదని అంటున్నారు.
Read Also : T Congress : కాంగ్రెస్ కు ఈ 3 రోజులు చాల కీలకం..కేసీఆర్ ఏమైనా చేయొచ్చు..