Site icon HashtagU Telugu

TS HighCourt: బర్రెలక్కకు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు

High Court Hyderabad

High Court Hyderabad

TS HighCourt: శిరీష (బర్రెలక్క)కు భద్రత కల్పించాలి తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శిరీషకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని, అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని హైకోర్టు తేల్చి చెప్పింది.

బర్రెలక్కగా గుర్తింపు పొంది కర్నె శిరీష్ (26) ఈ ఎన్నికల్లో కొల్లపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నిరుద్యోగుల గొంతుకగా ఎన్నికల్లో పోటీచేస్తున్న బర్రెలక్కకు బెదిరింపులు మొదలయ్యాయి. ప్రచారంలో ఆమెపై, ఆమె సోదరుడిపై దాడి జరిగింది. పోటీ నుంచి తప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి.

అయితే, ఈ ప్రలోభాలకు, బెదిరింపులకు, దాడులకు తాను భయపడబోనని బర్రెలక్క తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. కాసేపటి క్రితమే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని పేర్కొంది.

Also Read: Barrelakka: ఎన్నికల బరిలో దూసుకుపోతున్న బర్రెలక్క.. ప్రత్యర్థి పార్టీలకు బిగ్ ఝలక్!