Protest by BRS MLAs : ‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

  • Written By:
  • Publish Date - February 14, 2024 / 03:53 PM IST

‘కంచెలు తొలగిస్తామని ఇదేమి కంచెల పాలనా’..? అంటూ అసెంబ్లీ గేటు ముందు నేలపై కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAS) నిరసన (Protest) చేపట్టారు. అసెంబ్లీ లో కాంగ్రెస్ నేతల (Congress Leaders) వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశాలను వాకౌట్ చేసిన బిఆర్ఎస్ నేతలు..అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వెళ్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకోవడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడకూడదనే నిబంధన లేనేలేదని స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్షాల గొంతు అణిచివేసేందుకు అధికార పక్షం చేస్తున్న కుట్ర ఇది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు.. అసెంబ్లీ బయట కూడా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరు అని మండిప‌డ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం.. అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన‌దించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతకు ముందు..

అసెంబ్లీ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదనలు సాగాయి. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనపై, సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేయగా.. సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ భాష సరైనదేనా.? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. దానిపై చర్చిద్దామా.? అని సవాల్ విసిరారు. ఇదేనా తెలంగాణ సంప్రదాయం.? అని నిలదీశారు. బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని.. కుంగిన మేడిగడ్డలో నీళ్లు నింపిన పరిస్థితి ఉందా.? అని నిలదీశారు. చర్చకు రమ్మంటే పారిపోయారు అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాళేశ్వరం, గోదావరి జలాలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ కు ఆసక్తి లేదని.. సభ నుంచి ఎప్పుడు వెళ్లిపోదామా? అని చూస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా విమర్శలు చేశారు.

Read Also : Valentine’s Day : మాస్ మహారాజా ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ మాములుగా లేదు..